విశాఖ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బలమైన భారత్ కోసం,ఒక ధృడమైన దేశం కోసం, జగత్ అంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ ఆ దారిలో ఎదుర్కున్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతీ అవమానాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దెలా నడిపిస్తున్నారని ప్రధాని మోడీ పై ప్రశంసలు కురిపించారు.నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న దార్శనికుడని సీఎం చంద్రబాబుని కొనియాడారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారని అలా నిలబడినందుకే ఈ రోజున మన ప్రధాని మోడీ సారధ్యంలో 2 లక్షల కోట్ల విలువైన ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణ పట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు ఇతర ప్రాజెక్టులు అన్నిటికీ కలిపి ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోయేవని వివరించారు.కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, అమరావతి రాజధాని పెట్టుబడులు, పోలవరం నిధులు, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించే గొప్ప సంకల్పాలకు బలం ఇచ్చింది ప్రజలు మా మీద పెట్టిన భరోసా, మాకు ఇచ్చిన విజయమని పేర్కొన్నారు. గత ఐదేళ్ళ వైసీపీ అవినీతి, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను నిలబెడదాం, అభివృద్ధి పథంలో నడిపిద్దాం అని చెప్పి ఆశా జ్యోతిలా ప్రధాని మోడీ నిలబడ్డారని కొనియాడారు.ఏపికి అభివృద్ధి ఆస్కారమే లేదు అనే స్థితి నుండి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా చంద్రబాబు నాయకత్వంలో ప్రధాని నిర్దేశకత్వంలో, వారి సూచనలు సహకారాలతో ఎన్డీఏ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని వివరించారు.
ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఆశా జ్యోతిలా నిలబడ్డారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin2 Mins Read