తిరుపతి పట్టణంలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత తీసుకున్న చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు టీటీడీ భవనంలో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. వారిలో మనోధైర్యం నింపారు. వారిని పరామర్శించి, ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఊహాగానాలు, దుష్ప్రచారాలు కాకుండా విషాదానికి దారి తీసిన వాస్తవ పరిస్థితులను ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుసుకున్నారు. తిరుపతి పట్టణం స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను కలిసి చికిత్సకయ్యే ఖర్చుల గురించి దిగులుపడవద్దని, ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని… దానితో పాటు పరిహారం కూడా ఇస్తామని… వైకుంఠ ద్వార దర్శనం చేయించి పంపిస్తామని భరోసా ఇచ్చారు.
ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథెడ్డిని సస్పెండ్ చేశాం. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్వి శ్రీధర్ ను తక్షణమే బదిలీ చేస్తున్నాం. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
టీటీడీ ద్వారా మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తాం. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని భరోసానిచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు