దావోస్ లోని బెల్వేడార్ లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమయ్యారు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్, భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటుచేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీమిట్టల్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీ మిట్టల్ సానుకూలంగా స్పందించారని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఈ భేటీలో ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఏపీ ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.
మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు బృందం
By admin1 Min Read