ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణం, పెట్టుబడుల సాధన, యువతకు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పూర్తయింది. కాగా, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారని టీడీపీ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపింది. ఈ నాలుగు రోజుల పర్యటనలో క్షణం తీరిక లేకుండా ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారని పేర్కొంది. ఈమేరకు సీఎం చంద్రబాబు కలిసిన ప్రఖ్యాత సంస్థల అధినేతలు, ఆయన జరిపిన చర్చల వివరాలను ఈ పోస్ట్ లో తెలిపింది.
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. నాలుగు రోజుల టూర్లో క్షణం తీరిక లేకుండా ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారు. #AndhraIsBack#InvestInAP… pic.twitter.com/k7WyDj2fEw
— Telugu Desam Party (@JaiTDP) January 24, 2025