అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏపీ సీఎం చంద్రబాబను డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించి నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ సీఎం రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు గారు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని షర్మిల ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ACBని సైతం రంగంలోకి దించకపోవడం అదానీని కాపాడుతున్నారనే దానికి నిదర్శనమని ఆరోపించారు . అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజం. మోడీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవమని షర్మిల ఆరోపించారు.
అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించి నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleభారతదేశ చరిత్ర స్ఫూర్తిదాయకం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
Next Article ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు