ప్రైవేట్ ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్ ఎయిడెడ్ కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులతో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. ఇంటర్ కాలేజీలకు అఫ్లియేషన్ జారీలో సమస్యలు ఉన్నాయని, నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగానే ఇంటర్ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కాలేజీ ట్రాన్స్ ఫర్ విషయంలో అపరాధ రుసుముల భారాన్ని తగ్గించాలి. జూనియర్ కాలేజీల విషయంలో బోర్డు కమిటీలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ నుంచి ఒకరికి స్థానం కల్పించాలని మంత్రి లోకేష్ ని కోరారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అతి తక్కవ జీతాలు అందుతున్నాయని, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేసి ఆదుకోవాలని కోరారు. ఇండస్ట్రీస్ తో ఐటీఐలను లింకేజీ చేయాలి. ప్రభుత్వ విభాగాల్లో అప్రెంటిషిఫ్ ను అమలు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పాలిటెక్నిక్ సిలబస్, పరీక్షా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ ఓకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవితో పాటు ప్రైవేట్ ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్ ఎయిడెడ్ కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులతో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం
By admin1 Min Read
Previous Articleఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రానికి ప్రియాంక బ్రేక్ ..!
Next Article ఐసీసీ టీమ్ లో నలుగురు భారత క్రికెటర్లకు స్థానం