ఐసీసీ మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుని భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రపంచ కప్ లో ఆడిన టీమ్ లో నుండి ఐసీసీ ఎంపిక చేసిన టీమ్ లో నలుగురు భారత క్రికెటర్లకు స్థానం లభించింది. మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష, కమలినీ, ఆయుషీ, వైష్ణవి శర్మ లకు చోటు దక్కింది. ఈ టోర్నీలో త్రిష 147 స్ట్రైక్ రేట్ తో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే బంతితో కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. కమలినీ 143 పరుగులతో రాణించింది. వైష్ణవి (17 వికెట్లు), ఆయుషీ (14 వికెట్లు) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. కైలా రేనెక్, జెమా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెరిన్, కేథి జోన్స్ (ఇంగ్లాండ్), కోయ్ మీ బ్రే (ఆస్ట్రేలియా), చమోది (శ్రీలంక), పూజ మహతో (నేపాల్) కూడా ఈ టీమ్ లో స్థానం సంపాదించుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు