ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే లో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు చారిత్రాత్మకమైన అధికారాన్ని సాధించినందుకు బీజేపీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు ప్రతిధ్వనిగా నిలుస్తున్నాయి. హర్యానా మరియు మహారాష్ట్రల తర్వాత ఢిల్లీలో సాధించిన ఈ విజయం ప్రధాని మోడీ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంపై మరియు వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఆయన అంకితభావంపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ విజయం మన దేశ రాజధానికి అభివృద్ధికి మరియు శ్రేయస్సుకి కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు ప్రతిధ్వని: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read