గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వేదికగా BIMSTEC యూత్ సమ్మిట్ జరుగుతోంది. ఈనెల 11 వరకు ఐదురోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. యువత నేతృత్వంలో అభివృద్ధి! అనే నినాదంతో జరగనుంది. యువత నేతృత్వంలో సహకారం, ఆవిష్కరణలు మరియు ప్రాంతీయ వృద్ధిని పెంపొందించడంలో ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన భూమిక పోషించనుంది. ఖాట్మండులో జరిగిన 4వ BIMSTEC సమ్మిట్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువత ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గాంధీనగర్ వేదికగా BIMSTEC యూత్ సమ్మిట్: ప్రారంభించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా
By admin1 Min Read