ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాని కలిశారు. ఈ సందర్భంగా, ఈ నెల 22వ తేదీ నుండి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హాలులో ఎమ్మెల్యేల కోసం నిర్వహించనున్న ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించవలసిందిగా కోరారు. ఓరియెంటేషన్ కార్యక్రమం మొదటి రోజు ప్రారంభోత్సవానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గారు హాజరవుతుండగా… రెండో రోజు ముగింపు కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నారు. ఇక ఈనెల 24 నుండి శాసనసభ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే.
Previous Article‘స్పిన్నర్’ అనే పేరుతో రిలయన్స్ స్పోర్ట్స్ డ్రింక్స్
Next Article శ్రీ విష్ణు “సింగల్” గ్లిమ్ప్స్ విడుదల…!