రిలయన్స్ స్పోర్ట్స్ డ్రింక్స్ కేటగిరీలోకి ప్రవేశించింది. ‘స్పిన్నర్’ అనే బ్రాండ్ తో డ్రింక్ ను తీసుకొచ్చింది. కాంపా కోలాతో కూల్ డ్రింక్ మార్కెట్ లోకి వచ్చిన రిలయన్స్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రింక్స్ కేటగిరీలోకి ప్రవేశించింది. స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ‘స్పిన్నర్’ బ్రాండ్ ను ఆవిష్కరించింది. ఈ డ్రింక్ ను రూ.10కే అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డ్రింక్ కు విస్తృతంగా ప్రచారం కల్పించడం కోసం వివిధ ఐపీఎల్ టీమ్ లతో జట్టు కట్టినట్లు పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లతో కలిసి నేషనల్ లెవెల్ లో బ్రాండ్ విజిబిలిటీని పెంచనున్నామని కంపెనీ తెలిపింది. రానున్న మూడేళ్లలో స్పోర్ట్స్ బేవరేజెస్ కేటగిరినీ 1 బిలియన్ డాలర్ల మార్కెట్ అందుకునేలా ఈ డ్రింక్ కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. లెమన్ ఆరెంజ్ నైట్రో బ్లూ ఫ్లేవర్ లలో లభిస్తుంది. స్పిన్నర్ డ్రింక్ తీసుకురావడం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తో జతకట్టడం ఆనందంగా ఉందని మురళీధరన్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు