నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కారని పేర్కొన్నారు. తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారని ఆయన జయంతి వేడుకలను కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.దామోదరం సంజీవయ్య గారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు: మంత్రి లోకేష్
By admin1 Min Read