ప్రధాని నరేంద్రమోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ ఎంపీ, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ధీటైన జవాబు ఇచ్చారు.ప్రధాని కులం గురించి మాట్లాడే ముందు?…ముందు రాహుల్ గాంధీ కులం ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు.సీఎం వ్యాఖ్యలపైనా స్పందిస్తూ…ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారని రఘునందన్ రావు అన్నారు.రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు.
ఈ మేరకు రఘునందన్ మాట్లాడుతూ…కుల గణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా రాసి ఉందా అని నిలదీశారు.కుల గణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని కొందరు అంటున్నారని…అలా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీశారు.అసలు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.మా నాయకుడు నరేంద్రమోదీ మంత్రివర్గంలో 17 మంది బీసీలు ఉన్నారు…కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరే బీసీ మంత్రులు ఉన్నారని రఘునందన్ రావు గుర్తు చేశారు.ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని సీఎంకు రఘునందన్ హితవు పలికారు.