గన్నవరం మాజీ శాసనసభ సభ్యుడు,వైసిపి నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై… వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు.ఈ మేరకు వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ తెలిపారు.కాగా రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ…రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.అయితే అక్రమ అరెస్టులతో అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జగన్ హెచ్చరించారు.
Previous Articleప్రధాని కులం గురించి మాట్లాడే ముందు?…రాహుల్ గాంధీ కులం ఏమిటో రేవంత్ చెప్పాలి :- ఎంపీ రఘునందన్ రావు
Next Article వంశీ అరెస్ట్ సక్రమమే :- హోమ్ మంత్రి అనిత