ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నేటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు! ఏకాగ్రతతో ఉండండి, మీ వంతు కృషి చేయండి మరియు మిమ్మల్ని మీరు విశ్వసించండని ఆయన ట్వీట్ చేశారు. ఇక విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మీ పరీక్షలకు శుభాకాంక్షలు! శ్రద్ధగా ఉండాలని కానీ ఒత్తిడికి గురికాకూండా ఉండాలని సూచించారు. వేసవి వేడి కారణంగా డీహైడ్రేటెడ్ కాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్… విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్
By admin1 Min Read

