చిత్తూరు జిల్లా, జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. గత 8 నెలలుగా పాలనలో నిమగ్నమైన కారణంగా పార్టీ శ్రేణులకు ఇంత సమయం ఇవ్వలేక పోయినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలను కలుసుకోవడం సంతోషాన్నిచ్చిందని వివరించారు. కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే 30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరులో టీడీపీ విజయబావుటా ఎగరేసిందని అందుకే క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలలో ప్రతిభ కనబరిచిన వారిని సమావేశంలో ప్రత్యేకంగా అభినందించానట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు పార్టీ కేడర్‌కు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక నుండి పర్యటనకు వెళ్లిన ప్రతి చోట కార్యకర్తలు, నేతలతో సమావేశమవనున్నట్లు స్పష్టం చేశారు. తనకు, కార్యకర్తలకు మధ్య దూరం ఉండబోదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
Previous Articleసీనియర్ ఐపీఎస్ అధికారి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్
Next Article ఆ ప్రచారం అవాస్తవం…ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టత