ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈమేరకు ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. గతేడాది గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.… pic.twitter.com/96uI4Xb0Zr
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 2, 2025