ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకు ఇంత అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కార్యకర్తల కృషిని ప్రశంసించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ-జనసేన-టీడీపీ ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.ఈ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో వారికి కూడా అభినందనలు తెలిపారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోని మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని మరింతశిఖరాలకు తీసుకెళతాయని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు