ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సౌతాఫ్రికా -న్యూజిల్యాండ్ జట్ల మధ్య నేడు జరిగిన రెండో సెమీ ఫైనల్ లో 50 పరుగుల తేడాతో గెలిచి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర 108 (101; 13×4, 1×6), కేన్ విలియమ్సన్ 102 (94; 10×4, 2×6) సెంచరీలతో కివీస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. డేరీ మిచెల్ 49 (37; 4×4, 1×6), గ్లెన్ ఫిలిప్స్ 49 నాటౌట్ (27; 6×4, 1×6) కూడా ఆకట్టుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, రబడా 2 వికెట్లు, ముల్డర్ 1 వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. రస్సీ వెన్ డర్ డస్సెన్ 69 (66; 4×4, 2×6), తెంబ బావుమా 56 (71; 4×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు.అడెన్ మార్క్రమ్ 31 (29; 3×4) చివరి వరకు డేవిడ్ మిల్లర్ 100 నాటౌట్ (67; 10×4, 4×6) పోరాడాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 3 వికెట్లు, మాట్ హెన్రీ 2 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు, బ్రేస్ వెల్ 1 వికెట్, రచిన్ రవీంద్ర 1 వికెట్ పడగొట్టారు. ఈనెల 9న జరిగే ఫైనల్ లో భారత్ తో న్యూజిలాండ్ తలపడనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు