దేశంలోనే మొట్టమొదటి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా తొలిదశలో 161 పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి.కాగా ప్రస్తుతం ఆ సేవలు 200 వరకు విస్తరించబడ్డాయి. ప్రభుత్వం కేటాయించిన వాట్సప్ నెంబర్ 9552300009 ను ఉపయోగించి మనమిత్ర సేవలను అందుకోవచ్చు. ప్రజలు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా వారు సులభతరమైన సేవలు పొందే విధంగా మనమిత్రను ప్రభుత్వం రూపొందించింది. పాలనలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ లో ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ ‘మెటా’ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు