విజయవాడలో ప్రఖ్యాత వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మన్‌హటన్’ పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మనం తీసుకునే ఆహారమే మెడిసిన్ అని కిచెన్ ఫార్మసీ అని చంద్రబాబు ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం అందిస్తాడు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. రానున్న 4 సంవత్సరాలలో 50 లక్షల ఎకరాలకు నేచురల్ ఫార్మింగ్ ను విస్తరించనున్నట్లు తెలిపారు. ఏపీని దీనికి చిరునామాగా మార్చుతామని తెలిపారు. బసవతారకం హాస్పిటల్ నేపథ్యాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడును తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది పదవికాదని బాధ్యత అని వేలాదిమందిని క్యాన్సర్ బారిన పడకుండా నివారించే అవకాశం ఉంటుందని అన్నారు. అమరావతి లో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ నుండి ప్రజలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆహారమే మెడిసిన్… కిచెనే ఫార్మసీ:’మంటాడ టు మన్‌హటన్’ పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు
By admin1 Min Read