ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తాజాగా అసెంబ్లీలోని ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో టెండర్లు ఖరారైన రూ.37,702.15 కోట్ల విలువైన 59 పనులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొత్తం రూ.48,012 కోట్ల విలువైన 73 పనులకు గతంలో CRDA ఆమోదం తెలుపగా అందులో 61 పనులకు CRDA, ADC టెండర్లు పిలిచాయి. వాటిలో 59 పనులకు బిడ్స్ ఓపెన్ చేసి కాంట్రాక్టు సంస్థలను ఖరారు చేశారు. ఇక అథారిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాలు పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. 24 పనులకు టెండర్లు పిలిచి రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు బిడ్స్ ఖరారు చేసినట్లు వివరించారు. మిగిలిన రెండు పనులకు ఈనెల 17న టెండర్లు చేయనున్నట్లు తెలిపారు. ADC రూ.15,095.04 కోట్ల విలువైన 37 పనులకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. త్వరలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం…రూ.37,702.15 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం
By admin1 Min Read