ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు పండించే అరకు కాఫీని మరింత ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లు కలిసి పార్లమెంటులో అరకు కాఫీ ప్రచారం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరియు అరకు కాఫీ కోసం శాశ్వతంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయమని కోరారు. తోటి పార్లమెంట్ సభ్యులు మరియు ప్రముఖులకు ఈ కాఫీ రుచిని మరింత దగ్గర చేసే విధంగా తీసుకురావాలనే భాగంగా ఈ ప్రయత్నం చేసినట్లు రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపారు. మన అరకు కాఫీ గురించి సాక్షాత్తు మన ప్రధాని మోడీనే మన్ కీ బాత్ వంటి పలు ముఖ్య సందర్భాలలో మన అరకు కాఫీ యొక్క విశిష్టతను ప్రస్తావించిన విషయం తెలిసిందే. అటువంటి అరకు కాఫీని ప్రోత్సహించడానికి నేడు స్పీకర్ ను కలిసి విన్నవించగా…స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు సానుకూలంగా స్పందించి, ప్రత్యేక చొరవతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల లోనే ప్రారంభించేలా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి మరియు అరకు కాఫీని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్… స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కూటమి ఎంపీలు..!
By admin1 Min Read