పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచ కప్, తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్లలో అదరగొట్టింది. ఇక టెస్టు క్రికెట్ లో మాత్రం భారత జట్టు ప్రదర్శన అంత మెరుగ్గా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మొదలైనప్పటి నుండి వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్ ఈసారి ఫైనల్ చేయలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో 1-3తో సిరీస్ కోల్పోవడంతో టెస్టుల్లో భారత్ మరింత పటిష్టం కావాలని భావిస్తున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ కూడా టెస్టు క్రికెట్ లో భారత ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ లో రాణిస్తున్నా టెస్టులలో సరిగా ఆడడం లేదని అతను టెస్టుల్లో కూడా సరైన ఫామ్ అందుకోవాలని ఆకాంక్షించాడు. జూన్ లో ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఉన్న నేపథ్యంలో రోహిత్ దీనిపై మరింత లోతుగా ఆలోచించాలని సూచించాడు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చిన గంగూలీ టెస్టు క్రికెట్ లో కూడా భారత్ ను అద్భుతంగా నడిపించాలని పేర్కొన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు