ఏపీ లోని ప్రతి నియోజకవర్గంలో 100 నుండి 300 బెడ్స్ హాస్పిటల్స్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.రాష్ట్రంలో ఏ జిల్లాలో, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటి నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యల పై సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల గురించి మాట్లాడారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల హార్ట్ డిసీజెస్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నారు . రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్‌టెన్షన్ అధికంగా కనిపిస్తోందని ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం తెలిపారు. వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు ఆచారించాలన్నారు. ఉప్పు, చక్కెర, వంట నూనెల వినియోగం తగ్గిస్తే చాలా రకాల వ్యాధులు అరికట్టవచ్చని సూచించారు. రోజుకు కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాయామం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని సాధన చేస్తోంది. ఇటీవలే న్యూట్రిఫుల్ అనే యాప్ తయారు చేశాం. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాప్ ఇది. దీన్ని ఇప్పటి వరకు 4 లక్షల మంది డౌన్లో చేసుకుని వినియోగిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ప్రజలకు పలు కీలక సూచనలు
By admin1 Min Read