కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, “ఒకే రాష్ట్రం – ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (RRB)” విధానం మే 1, 2025 నుండి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ఆర్‌ఆర్‌బీలను ఏకీకృతం చేయనున్న కేంద్రం, కొత్తగా 15 బ్యాంకులను 5 కొత్త RRBలుగా పునర్వ్యవస్థీకరించనుంది. దీంతో మొత్తం RRBల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది. ఈ ఏకీకరణ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌లోని చైతన్య గోదావరి,ఆంధ్ర ప్రగతి,సప్తగిరి గ్రామీణ బ్యాంకులు కలిసి “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్”గా రూపాంతరం చెందనున్నాయి. కొత్త బ్యాంక్‌కి అమరావతి కేంద్రంగా ఉండగా,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ బ్యాంకుల విలీనం జరుగుతుంది.ఈ సంస్కరణల వల్ల బ్యాంకింగ్ సేవల్లో సమర్థత, ప్రజలకు సేవల విస్తరణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రతి RRBకి రూ.2వేల కోట్ల అధీకృత మూలధనం ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రైతులు, కూలీలు, కళాకారులకు రుణాలు అందించేందుకు RRBలు కీలకంగా నిలుస్తున్నాయి.
ఒకే రాష్ట్రం – ఒక ఆర్‌ఆర్‌బీ…మే 1 నుండి కొత్త విధానం అమల్లోకి
By admin1 Min Read