రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.బారన్ జిల్లాలో హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరుగుతుండగా,అపశృతి చోటుచేసుకుంది.కోటా ప్రాంతానికి చెందిన వాసుదేవ్ ఖత్రి అనే వ్యక్తి, బెలూన్ కట్టిన తాడుకు చిక్కుకుని అనుకోకుండా గాల్లోకి లేచిపోయాడు.బెలూన్ వంద అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత తాడు తెగిపోవడంతో అతడు కిందపడిపోయాడు.తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.బారన్ జిల్లా ఫౌండేషన్ డే సందర్భంగా జరుగుతున్న వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో,మూడు రోజులపాటు జరగాల్సిన ఉత్సవాలను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది.ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ప్రజల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రాజస్థాన్:- హాట్ ఎయిర్ బెలూన్ నుండి క్రింద పడి వ్యక్తి మృతి…!
By admin1 Min Read
Previous Articleమద్యం మత్తులో రైలు పట్టాలపై కారు నడిపిన వ్యక్తి…!
Next Article వైసీపీ నేత కారుమూరిపై కేసు నమోదు…!