టీమిండియా మాజీ కెప్టెన్,దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తాజాగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ భేటీ ఫోటోలను డీకే శివకుమార్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, “భారత క్రికెట్‌కు, కర్నాటకకు గొప్ప సేవలు అందించిన కుంబ్లేను కలవడం గర్వకారణం.గౌరవించదగ్గ కన్నడిగుడితో చర్చలు జరపడం ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.దీనికి స్పందించిన కుంబ్లే, “మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది. సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.అయితే,ఈ భేటీ రాజకీయ కోణం దాల్చిన నేపథ్యంలో…అనిల్ కుంబ్లే రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.అయితే దీనిపై స్పష్టతనిస్తూ అనిల్ కుంబ్లే స్పందించాడు.ఇది కేవలం ఒక వ్యక్తిగత సమావేశమేనని,రాజకీయ ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.అయినా సోషల్ మీడియాలో ఈ భేటీపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
అనిల్ కుంబ్లే తో కర్ణాటక డిప్యూటీ సిఎల్ డీకే శివకుమార్ భేటీ…!
By admin1 Min Read