తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే వైసీపీ ఆరోపణలు చేస్తుందని టీడీపీ మండిపడింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ తీరును ఎండగట్టారు. తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీ ఫేక్ ప్రచారం పై కఠినమైన చర్యలు ఉంటాయని లోకేష్ హెచ్చరించారు.
Previous Articleప్రమాదానికి గురైన అహ్మదాబాద్ విమాన బ్లాక్ బాక్స్ లభ్యం
Next Article WTC ఫైనల్: టైటిల్ దిశగా సాగుతున్న సౌతాఫ్రికా