అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఎంతో కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ లభ్యమైంది. ఈ విమానం ఢీకొన్న బీజే మెడికల్ కాలేజీ భవన శిథిలాల నుండి దీనిని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్విస్టిగేషన్ బ్యూరో తెలిపింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ టీమ్ లతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం నిన్న ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదం ఎలా జరిగిందనే దానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
బ్లాక్ బాక్స్ అంటే..?
ప్రతి కమర్షియల్ ఫ్లైట్ లో రెండు బాక్స్ లు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేస్తుంది. మరొకటి కాక్ పిట్ వాయిస్ రికార్డుకు వినియోగిస్తారు. ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, ఎమర్జెన్సీ పరిస్థితిని తెలియజేస్తూ ‘మేడే’ అంటూ సమీపంలోని ఏటీసీకి పైలట్ ఓ మెసేజ్ పంపుతారు. వీటితోపాటు పైలట్-కోపైలట్ సంభాషణలన్నీ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్ఎఆర్)లో రికార్డవుతాయి. ఈ డీఎఫ్ఆర్నే బ్లాక్ బాక్స్ అంటారు.
Previous Articleబెలుం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు: మంత్రి దుర్గేష్ హార్షం
Next Article దమ్ముంటే, అది నిరూపించండి: మంత్రి లోకేష్ సవాల్