ఐసీసీ ఈవెంట్ లలో ఎన్నో సార్లు టైటిల్ వరకు వెళ్లి నిరాశ పడిన సౌతాఫ్రికా ఎట్టకేలకు మొదటి టైటిల్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. అది కూడా ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కావడంతో సౌతాఫ్రికా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ను 207 పరుగులకే కట్టడి చేసింది. మిచెల్ స్టార్క్ 58 (136; 5×4) హాఫ్ సెంచరీతో మంచి పోరాటం కనబరిచాడు. అలెక్స్ కేరీ 43 (50; 5×4) పరుగులతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా 4 వికెట్లు, లుంగి ఎంగిడి 3 వికెట్లు, మార్క్రమ్, జాన్సన్, ముల్డర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని సౌతాఫ్రికా టార్గెట్ 282గా ఉంది. టార్గెట్ ఛేదనలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా రికెల్టన్ (6), ముల్డర్ (27) వికెట్లను కోల్పోయినా ఏడెన్ మార్క్రమ్ 102 నాటౌట్ (159; 11×4) సెంచరీతో సత్తా చాటాడు.
కెప్టెన్ బావుమా 65 నాటౌట్ (121; 5×4) నిలకడగా బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికాను మూడోరోజు ఆట ముగిసే సమయానికి పటిష్టం స్థితిలో నిలిపారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. సౌతాఫ్రికా చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో 69 పరుగులు చేస్తే సౌతాఫ్రికా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా చరిత్ర సృష్టిస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు