వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1, 2021న సెకీతో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం జరిగిందనే పేర్కొన్నారు. సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, 4 డిస్కంలు ఈ ఒప్పందంలో భాగస్వాములని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక ఒప్పందంతో రాష్ట్రానికి, రైతులకు అండగా నిలిచిన కేంద్రాన్ని అభినందించాలని అన్నారు.ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఇదే సెకీ, ఇవే ఇన్సెంటివ్స్ ఇచ్చి పలు రాష్ట్రాలకు విద్యుత్ అమ్మిందని తెలిపారు. ఆ రాష్ట్రాలు అన్నింటికన్నా ఏపీ 12పైసలు తక్కువకు కొన్నదని వెల్లడించారు.ఇలా సంపద సృష్టి నేను చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారని చెప్పారు. మంచి చేసిన నాపైనే నిందలు వేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఐదేళ్లు అభివృద్ధి దిశగా అడుగులు వేసిన రాష్ట్రం.. ఆరు నెలలుగా తిరోగమనం దిశగా వెళ్తోందని విమర్శించారు. గత ఐదేళ్లు ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని కానీ ఆ సంస్కరణలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటకెక్కించేస్తోందని ఆక్షేపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు