ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘు రామకృష్ణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి ఇచ్చింది.ప్రస్తుతం ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.అయితే రఘు రామకృష్ణ రాజు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో గవర్నమెంట్ పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు.
రఘురామ కృష్ణంరాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీ.వీ.ఎల్. నరసింహరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వైఎస్ఆర్ సీపీ పార్టీలో ఉన్నప్పుడే ఆయన్ని అదే ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది.రఘరామ కృష్ణం రాజు ఎన్నికల కంటే ముందు టీడీపీ లోకి వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులకు ఏయే సదుపాయాలు ఉంటాయో అవే సదుపాయాలు ఇప్పటి నుండి రఘు రామ కృష్ణం రాజుకు ఉండనున్నాయి.