ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి పడిపోవడంతో విశాఖపట్నం ను పొగమంచు కమ్మేసింది.ఈరోజు ఉదయం పొగమంచు కారణంగా విశాఖపట్నం ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కు సమస్య తలెత్తింది.లైట్ సరిగా లేకపోవడంతో ల్యాండింగ్ కు ఇబ్బంది కలగడం వలన పలు విమానాలను దారి మళ్లించారు.నిబంధనల మేరకు లైట్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి వెల్లడించారు.ఢిల్లీ – విశాఖపట్నం ఫ్లైట్‌ను భువనేశ్వర్ వైపు, హైదరాబాద్ -విశాఖపట్నం, బెంగళూరు- విశాఖపట్నం విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించి, సిబ్బందికి సహకరించాలని ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
Previous Articleహిమాచల్ ప్రదేశ్ లో భూకంపం..!
Next Article రఘు రామకృష్ణ రాజుకు కేబినెట్ హోదా…!