రైతుల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలను ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తిప్పికొట్టారు. ఎవరు రైతులకు భరోసాగా నిలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని మనోహర్ సామాజిక మాధ్యమం’ఎక్స్’ లో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలన చేసిన గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13నాటికి- 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసింది. కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వివరించారు. కలక్టరేట్ల దగ్గరకు బస్తాలు మోసుకువెళ్ళి ఫోటో షూట్ చేసిన వైసీపీ వాళ్ళు గత సీజన్లో గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీసం సేకరణ కూడా చేపట్టలేదు. This is వాస్తవం! అంటూ పేర్కొన్నారు.
#WakeupJagan
ఎవరు రైతులకు భరోసాగా నిలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసు.
వైసీపీ పాలన చేసిన గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13నాటికి- 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసింది. కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కలక్టరేట్ల… pic.twitter.com/Lwu8q3doxZ— Manohar Nadendla (@mnadendla) December 14, 2024