ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు అమలులోకి వచ్చినా జరిగేది 2029లోనే అని పేర్కొన్నారు. “వన్ నేషన్ వన్ ఎలక్షన్” విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. వైసీపీ చేసే నాటకాలు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. పబ్బం గడుపుకునేందుకు ఏది పడితే అది మాట్లాడుతోందని ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొన్నారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. తాజాగా తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ను మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని దానిపై ప్రతి చోటా చర్చ జరగాలని పేర్కొన్నారు. భావి తరాల మేలు కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు. విజన్-2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసూకోవాలని విజన్-2047 కూడా విజయవంతం అవుతుందని వివరించారు. సాగునీటి సంఘాలు, సహాకార తదితర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. ఇక ముందు జరుగనున్న కలెక్టర్ల సదస్సులు మార్పులు తీసుకొస్తామని ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతామని చెప్పారు. దీంతో సమయం సద్వినియోగమవడంతో పాటు అధికారులు మంత్రుల మధ్య సమన్వయం పెరుగుతుందని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు