సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్య విభాగం అధికారులతో విజయవాడలోని లెమెన్ ట్రీ హోటల్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో ఏపీ డిప్యూటీ సీఎం,గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇక ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడుతూ కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద 4000 కోట్లు ఖర్చుపెట్టాం అంటున్నారని అయితే తాను ఏ జిల్లాకి వెళ్ళినా నీళ్ళు రావట్లేదు అనే ఫిర్యాదు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
95.44 లక్షల కుటుంబాలకు గాను 70.04 లక్షల గృహాలకు నీటి కుళాయిలు అందించబడ్డాయి ఇంకా 25.40 లక్షల నీటి కుళాయిలు ఇవ్వాల్సి ఉంది అని జల్ జీవన్ మిషన్ తెలియజేసిందన్నారు. పల్స్ సర్వ చేయిస్తే – 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకే నీటి కుళాయిలు అందించబడ్డాయని పేర్కొన్నారు. ప్రజలకు మంచి తాగు నీరు అందించడం మన కనీస బాధ్యతని వివరించారు. దాదాపు కోటి కుటుంబాలకి నీటి అవసరాలు ఉన్నాయని వారందరికీ సురక్షిత మంచినీరు అందించాలి అనే ధ్యేయంగా ముందు వెళుతున్నట్లు తెలిపారు. మనసు పెట్టి ఇది సాధించేలా మీ అందరి సహకారం కావాలని పిలుపునిచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు