నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనీ పునర్వ్యవస్థీకరించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ సంస్థ 2025 నుండి ఉన్నత విద్యకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ల నిర్వహణపై మాత్రమే దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ టెస్టులను నిర్వహించాలని స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనీ ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా పది నియామకాలను తీసుకురానున్నట్లు పేర్కొన్న ఆయన పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఉండే విధంగా ప్రక్షాళన చేస్తామని వివరించారు. నీట్-యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులలో భాగంగా పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీ.యూ.ఈ.టీ-యూజీ)నుండి సంవత్సరానికి ఒక్కసారే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక నీట్-యూజీ టెస్టును ఆన్ లైన్ లో నిర్వహించాలా లేదా ఆఫ్ లైన్ లో నిర్వహించాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో రెండు సార్లు చర్చించినట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇక ప్రవేశ పరీక్షలకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ప్రక్షాళనకు చర్యలు
By admin1 Min Read