పెనమలూరు నియోజకవర్గం, ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రజల నుండి వస్తున్న ఎక్కువగా వస్తున్న భూ సమస్యల గురించి సీఎం మాట్లాడారు. వైసిపి పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ , 22a వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఈసందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు.
ప్రజల భూములకి రక్షణ ఇవ్వటానికి, ఇచ్చిన హామీ ప్రకారం మొదటి క్యాబినెట్ లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసినట్లు వివరించారు.ప్రజలు తమను93 శాతం గెలిపించారని వారి ఆశలు నెరవేర్చే పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 3 లక్షల మంది పాల్గొన్నారని 95,200 పిటిషన్లు వచ్చాయని పేర్కొన్నారు. జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. మన భూములు దోచుకోవటానికి, గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చింది. దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. భూమి పత్రాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలని జగన్ ఫోటో కాదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు లక్షా 57 వేల అర్జీలు వచ్చాయని వీటిలో భూముల పై చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. 22-ఏ పేరుతో చాలామంది భూములు లాక్కున్నారు. కోల్పోయిన భూములను తిరిగి బాధితులకు వచ్చేలా చూస్తామని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు