ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) తరుఫున రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేస్తామని ఏసీఏ అధ్యక్షుడు,పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ప్రకటించారు.త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని చెప్పారు.దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఏసీఏ ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్‌రెడ్డిఆదుకున్నాడు.సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు.ఒక 1×6 సిక్స్,9×4 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు.ఆల్‌రౌండర్లు జడేజా,సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు.99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదుచేశాడు.మ్యాచ్ చూడటానికి వచ్చిన నితీశ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు.కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.మూడో రోజు ఆట ముగిసే సమయానికి నితీష్‌రెడ్డి 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.