బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో భాగంగా ప్రస్తుతం మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు లో కీలక ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా నితీష్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తున్నది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితీష్ కుమార్ రెడ్డి, అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలి: తెలుగు తేజం నితీష్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు
By admin1 Min Read
Previous Articleకొత్త ఏడాది…అయోధ్యకు తరలి వస్తోన్న భక్తులు
Next Article నితీష్ రెడ్డికి నజరానా ప్రకటించిన ఏసిఏ…!