భారత్ క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వర్థమాన క్రికెటర్ రిషబ్ పంత్ ప్రశంసలు కురిపించాడు. ధోనిని భర్తీ చేయడం కష్టమని ధోనీ దేశానికి హీరో అని వ్యక్తిగతంగా మరియు ఒక క్రికెటర్ గా ధోనీ నుండి తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపాడు. ధోనీ తనకు మార్గదర్శి అని తను ఉన్నాడంటేనే జుట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నాడు. ఏదైనా సమస్య ఉంటే ధోనీతో పంచుకుంటానని దీంతో పరిష్కారం కూడా వస్తుందని తెలిపాడు. వికెట్ కీపర్ గా క్రికెటర్ గా ఓర్పు ఎంతో కీలకమని సలహా ఇస్తుంటాడని వివరించాడు. ప్రశాంతంగా ఉంటూ 100 శాతం ప్రదర్శన కనబరిచేలా ప్రయత్నించాలని చెప్తుంటాడని పంత్ తెలిపాడు. ధోనీతో ఎప్పుడూ తన రికార్డులు పోల్చుకోనని అన్నాడు. ఇక ఎన్నో విజయాలతో తనదైన శైలిలో భారత క్రికెట్ కు కెప్టెన్ గా వికెట్ కీపర్ గా బ్యాటర్ గా ఎనలేని సేవలందించిన ధోనీ తర్వాత అంత స్థిరత్వంతో ప్రస్తుతం పంత్ కొనసాగుతున్నాడు.
Previous Articleనమో భారత్ కారిడార్ ప్రారంభం
Next Article భారత్లో చైనా వైరస్ తొలి కేసు నమోదు!