ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ కారిడార్ ను ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సాహిబాబాద్, ఢిల్లీ లోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్.ఆర్.టీ.ఎస్ కారిడార్ లో 13 కిమీ అదనపు సెక్షన్ ను ప్రారంభించారు. నమో భారత్ కారిడార్ ఢిల్లీ మీరట్ కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వంతో విసిగిపోయారని ప్రస్తుతం వారు ఢిల్లీని ప్రగతి పథంలో ముందుకు నడిపించే ప్రభుత్వం కోరుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీనే ఢిల్లీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.12,200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అనంతరం స్టూడెంట్స్ తో కలిసి ప్రధాని మోడీ సాహిబాబాద్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. ఇక ఈ రూట్ లో కొత్తగా ప్రారంభించిన రైలు అండర్ గ్రౌండ్ లో 6 కి.మీ నడవనున్నట్లు అధికారులు తెలిపారు.
दिल्ली के विकास को मिली नई रफ्तार…
पीएम श्री @narendramodi ने साहिबाबाद और न्यू अशोक नगर के बीच दिल्ली-गाजियाबाद-मेरठ नमो भारत कॉरिडोर के 13 किलोमीटर लंबे हिस्से का उद्घाटन किया। इस दौरान उन्होंने नमो भारत ट्रेन में यात्रा कर बच्चों से संवाद भी किया।#MetroRevolutionInIndia… pic.twitter.com/gDGiQUxESr
— BJP (@BJP4India) January 5, 2025