ఇటీవల చెత్త ప్రదర్శనతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 3వ స్థానానికి దిగజారింది.భారత్ ఆడిన చివరి 8 టెస్టు మ్యాచ్ల్లో ఏకంగా 6 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో దీనికి ప్రధాన కారణమైంది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా భారత్ ఘోర ఓటమిని చవిచూసింది.దాదాపు 12 ఏళ్ల అనంతరం మొదటిసారి స్వదేశంలో ఒక టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కు గురైంది.3-0 తేడాతో సిరీస్లో గ్రాండ్ విక్టరీ సాధించింది.ఈ పరాజయాలు భారత ర్యాంకింగ్ దిగజారడానికి కారణాలయ్యాయి.అయితే దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 7 టెస్టు మ్యాచ్ విజయాలు సాధించడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగుపడింది.112 రేటింగ్ పాయింట్లతో సఫారీ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది.భారత్ 109 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి దిగజారింది.126 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది.
Previous Articleఐర్లాండ్ తో వన్డే సిరీస్ కు భారత కెప్టెన్ గా స్మృతి మంథాన
Next Article కెనడా ప్రధాన మంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా

