భారత మహిళా క్రికెట్ జట్టు వరుసగా స్వదేశంలో రెండో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐర్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తాజాగా జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 370 పరుగులు భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ 102 (91; 12×4) సెంచరీతో అదరగొట్టింది.హార్లీన్ డియోల్ 89 (84;12×4), కెప్టెన్ స్మృతి మంథాన 73 (54; 10×4, 2×6), ప్రతీక రావల్ 67 (61; 8×4,1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఐర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రిస్టీనా రిలీ 80 (113; 10×4) ఆకట్టుకుంది, సారా ఫోర్బ్స్ (38), లారా డెలానీ (37), లియా (27 నాటౌట్) పోరాడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/37), ప్రియా మిశ్రా (2/53) ఐర్లాండ్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

