లెబనాన్ కొత్త అధ్యక్షుడిగా ఆ దేశ సైనిక కమాండర్ జోసెఫ్ ఔన్ ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య 14 నెలల ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఒప్పందం కుదిరిన కొద్ది వారాల్లోనే ఈ పదవి భర్తీ అయింది. లెబనాన్ సార్వభౌమాధికార దేశం(సావరిన్ స్టేట్). బీరుట్ రాజధాని కాగా, ఉత్తర తూర్పు సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్ ఉన్నాయి. ఈ దేశం మధ్యధరా సముద్రతీరంలో ఆరేబియన్ దేశాల మధ్యన ఉంది.
Previous Articleత్వరలో గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ: సీఎం చంద్రబాబు
Next Article ఐర్లాండ్ తో రెండో వన్డేలోనూ విజయం సాధించిన భారత్

