తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కనివినిఎరుగని రీతిలో టీటీడీ ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో గ్యాలరీల్లో నుండి భక్తులు వాహనసేవలను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే లక్షలాది భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు. రథసప్తమి ఉత్సవాలు సందర్భంగా మొదటి మంగళవారానికి బదులుగా రెండవ మంగళవారం ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన టోకెన్లను ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో& తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో జారీ చేయనున్నారు. స్థానికులు ఈ మార్పును గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Previous Articleఐసీసీ టీమ్ లో నలుగురు భారత క్రికెటర్లకు స్థానం
Next Article అయోధ్య రామాలయ ప్రధాన పూజారి బ్రెయిన్ స్ట్రోక్ ..!