భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్ శతకంతో అదరగొట్టాడు. ఈక్రమంలో తన ఖాతాలో సరికొత్త రికార్డు కూడా చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్ లో గిల్ ఈ అరుదైన మైలురాయిని సాధించడం విశేషం.ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (1) వికెట్ కోల్పోయిన ఆ తర్వాత పుంజుకుంది. కోహ్లీ హాఫ్ సెంచరీతో (52) ఆకట్టుకున్నాడు. అలాగే గిల్ ఈ సిరీస్ లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

