నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ విధానంలోనూ మార్పులు చేపడుతోంది. తాజాగా ఇకపై సంవత్సరానికి రెండు విడతలుగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. 2026 విద్యా సంవత్సరం నుండి దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ పబ్లిక్ నోటీసును తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫిబ్రవరి-మార్చిలలో మొదటి విడత ఎగ్జామ్స్, మే నెలలో రెండో విడత నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా పూర్తి స్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని ముసాయిదాలో స్పష్టం చేసింది. వీటిపై మార్చి 9లోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది. బోర్డు ఎగ్జామ్స్ రెండుసార్లు నిర్వహించినప్పటికీ ప్రాక్టికల్స్/ ఇంటర్నల్ ఎవాల్యూషన్ మాత్రం ఒకేసారి చేయనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఈ విధానంతో స్టూడెంట్స్ తమను తాము మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు పరిశీలించి అనంతరం ముసాయిదాను సమీక్షించి, మార్పులకు తుది రూపు ఇచ్చి ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు