క్రికెట్ అభిమానులుకు ఈ సమ్మర్ లో వినోదాన్ని అందించేందుకు ఈనెల 22 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇక కొత్త సీజన్ ను మరింత కొత్తగా ప్రారంభించేందుకు డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తయారైంది. తమ టీమ్ కొత్త జెర్సీలను అలాగే తమ టీమ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ను ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే టీమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వెంకటేష్ అయ్యర్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఫ్రాంచైజీ తమ అఫీషియల్ ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక గతేడాది టైటిల్ విజేతగా నిలిచిన కోల్ కతా అప్పటి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. అయితే అనూహ్యంగా సీనియర్ ఆటగాడు రహానేను తీసుకుంది. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ లో కోల్ కతా 2012, 2014, 2024లలో ఇలా మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.
Image credits:kkr
కొత్త జెర్సీతో కోల్ కతా నైట్ రైడర్స్… కెప్టెన్ గా రహానే, వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్
By admin1 Min Read